ఏడుపాయల వద్ద విషాదం.. ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య!

కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద మంజీర నదిలో ఇద్దరు చిన్నారులతో కలిసి ఒక తల్లి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన (Medak Tragedy) చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (25) భర్త మరణించాడు. దీంతో ఆమె పొట్టకూటి కోసం హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది. ఆధార్ కార్డులలో సవరణల కోసం తన ఇద్దరు కుమార్తెలు వైష్ణవి, శ్రావణిలతో కలిసి మెదక్‌లోని అక్క ఇంటికి వచ్చింది.

పిల్లలతో కలిసి ఏడుపాయల క్షేత్రానికి వెళ్ళిన సరిత, ఆత్మహత్యకు ముందు తన తండ్రి బాలకృష్ణయ్యకు ఫోన్ చేసింది. తాము చనిపోతున్నామని తండ్రితో చెప్పిన కొద్దిసేపటికే, ఇద్దరు కుమార్తెలతో కలిసి మంజీర నది నీటిలోకి దూకేసింది.జీవితంపై విరక్తి చెంది ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బోట్ల సహాయంతో నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే, సమయం మించిపోవడం, చీకటి పడటంతో మంగళవారం రాత్రికి గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలను పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మల్కాపూర్ గ్రామంలోనూ, బాధితురాలి నివాసంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>