కలం, అచ్చంపేట: డీజిల్ ట్యాంకర్, ఆటో ఢీకొట్టుకున్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ హాజీపూర్ నుంచి నడింపల్లికి వెళ్తున్న ప్యాసింజర్ ఆటోను హనుమాన్ టెంపుల్ వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో నడింపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అంబులెన్స్‌లో అచ్చంపేట సివిల్ ఆసుపత్రికి తరలించారు.

