ఉమ్మడి మెదక్ జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం

కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్ ప్రాంతంలోని పలు మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

అత్యధికంగా సిర్గాపూర్‌లో 11 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డైంది. సిర్గాపూర్ – 11.0 సెం. మీ., కడ్పాల్ – 9.7, కల్హేర్ – 9.2, నిజాంపేట్ – 8.7, మనూర్ – 8.1, మెదక్ జిల్లా మిన్‌పూర్ – 7.0 సెం.మీ., సిద్దిపేట జిల్లా చీకోడ్ – 6.2 సెం.మీ. నమోదైనది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాలు, వాగుల్లోకి నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, వర్షం ధాటికి కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>