Mobile Popup Ad
Mobile Popup Ad

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఉద్రిక్తత

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) జిల్లా వర్గల్ మండలం వేలూరు నాచారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం దళితులు గద్దెను, పిల్లర్లను నిర్మించారు. అది ఆర్ అండ్ బీకి సంబంధించిన భూమి అని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 14 మందిపై కేసులు నమోదు చేశారు. విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటూ అర్ధరాత్రి వేళ గద్దెను కూల్చేశారు అధికారులు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారుల తీరుకు నిరసనగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అదే స్థలంలో అంబేద్కర్ గద్దెను పునర్నిర్మాణంను చేశారు దళితులు. వీరికి డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ మద్దతుగా నిలిచారు. గ్రామస్తులను చెదురుగొట్టేందుకు భారీగా పోలీసు బలగాలు వచ్చాయి. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందా అని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also: శ్రీలంక తీరంలో ఇరాన్​ యుద్ధనౌకపై దాడి.. 101 మంది గల్లంతు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>