ఓఆర్ఆర్ పై ప్రమాదం.. ఇద్దరు మృతి

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ఎగ్జిట్ -4 సమీపంలో ORR పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరి మృతి చెందారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వచ్చిన స్కార్పియో డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలోని ఒకరు, ఎదురుగా వస్తున్న కారులోని వ్యక్తి మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మృతులు నాగోల్ కు చెందిన శివ నాగరాజు 43 , కైలాష్ రామ్ 27 రాజస్తాన్ కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>