epaper
Wednesday, February 18, 2026
epaper

సిద్దిపేటలో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 14వ వార్డులోని ఓటర్లకు కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ (BRS) నాయకులు బాకీ కార్డులను పంచుతుండగా, ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిన మోసాలను తెలియజేసేలా డోకా కార్డు పేరుతో ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్( Congress) శ్రేణులు సిద్ధమయ్యారు.

వార్డులో ఒకే చోట రెండు పార్టీల నాయకులు ఎదురుపడటంతో పోటా పోటీగా నినాదాలు చేసుకుంటూ, రెచ్చగొట్టుకొనే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. వార్డులో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Siddipet
Siddipet

Read Also: ఫిరాయింపు కేసు.. రేపు కడియం విచారణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>