Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమకొండలో అర్ధరాత్రి హైడ్రామా: 360 గుడిసెల తొలగింపు!

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ (Hanamkonda) జిల్లా గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక లిక్కర్ ప్లాంట్ సమీపంలో గత ఐదేళ్లుగా నివసిస్తున్న సుమారు 360 కుటుంబాల గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించడం ప్రారంభించారు. నిన్ననే ఈ గుడిసెవాసులు తమకు న్యాయం చేయాలంటూ హన్మకొండ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆ మరుసటి రోజే అధికారులు ఈ ఆకస్మిక చర్యకు దిగడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాము ఇక్కడే నివసిస్తూ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు కూడా పొందామని, ఇప్పుడు తమను ఇక్కడి నుంచి వెళ్లగొడితే ఎక్కడికి పోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారుల చర్యను అడ్డుకుని నిరసన తెలిపిన వారిలో సుమారు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుడిసె వాసులు తమ నివాసాల రక్షణ కోసం ఆందోళన నిర్వహించిన మరుసటి రోజే ఈ తొలగింపు చర్యలు చేపట్టడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>