అహోబిలంలో హై టెన్షన్.. ఎమ్మెల్యే వాహనంపై రాళ్ల దాడి!

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం(Ahobilam)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) అక్కడికి చేరుకుని పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లిన సమయంలో, బయట ఉన్న ఎమ్మెల్యే వాహనంతో పాటు కాన్వాయ్‌లోని మరికొన్ని కార్లపై ప్రత్యర్థి వర్గీయులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మూడు వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసం కాగా, ఎమ్మెల్యే డ్రైవర్‌తో పాటు పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.

అయితే ఈ ఘర్షణల నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) ఎస్కార్ట్ వాహనం అక్కడున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అహోబిలం ప్రాంతం రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు అదనపు బలగాలతో వెంటనే అహోబిలం చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Also Read : ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తత.. పోటాపోటీగా సాగర్ గేట్ల ఎత్తివేత!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>