రేవంత్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం: మంత్రి దామోదర

కలం, మహబూబ్‌న‌గ‌ర్ బ్యూరో: తెలంగాణ సమాజంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా అందించాలనే ఆలోచన ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) అన్నారు. గురువారం అచ్చంపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారత దేశానికి 1949 నవంబరు 26న రాజ్యాంగం ఈ దేశానికి అంకితం చేసిన రోజని, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు, సమానత్వం, ఆత్మగౌరవంతో ప్రతి పౌరుడు బతకాలని డాక్టర్ అంబేద్కర్ రూపొందించారని గుర్తు ఆయన చేశారు.

అలాగే తమ ప్రభుత్వం పేదలకు మంచి ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత, మహిళా సాధికారత, రాష్ట్రం రైతు సుభిక్షంగా ఉండటంతో, రైతులు అప్పుల పాలు కాకూడదని, దీంతో పాటు సామాజిక భద్రత కింద సుమారు 6 లక్షల పింఛన్లను అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని,బ్యాంకుల ద్వారా వడ్డీ ప్రభుత్వం చెల్లించి ప్రస్తుతం 79 వేల కోట్ల రుణాలను అందుకు సంబంధించి వడ్డీ డబ్బులు సైతం చెల్లించడం జరుగుతుందని దామోదర్ రాజనర్సింహ వివరించారు. అలాగే విద్యార్థినీ, విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యంతో కూడిన విద్యనందించేలా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, ప్రీప్రైమరీ స్కూళ్ళు, అదేవిధంగా రూ.5 లక్షలు ఆరోగ్యభద్రత ఉంటే దానిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

ప్రతి మహిళ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఎవరూ ఊహించని పథకాలు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. మహిళలకు పెట్రోల్ బంకులు, సౌరవిద్యుత్తు, బస్సులు అందించి వారికి ఆర్థిక స్వావలంభన అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయంతో సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి, ఆలయానికి అవసరమైనన్ని నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందకరమన్నారు. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి 75 వేల ఎకరాలకు నీరందించేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు మహాత్మాగాంధీ – కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అచ్చంపేట నియోజకవర్గానికి 1.50 లక్షల ఎకరాలకు నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం ప్రకటించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు.

దీంతో పాటు కోటి మంది ఆడబిడ్డలకు చీరలను అందించడంతో పాటు వారిని కోటీశ్వరులను చేయడం ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ….బీసీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కులగణన వందేళ్ళ తర్వాత చేసి వారికి ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సముచిత స్థానం కల్పించిన ఘనత కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ… మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం, సంత్ సేవాలాల్ తో పాటు పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ రోజు తెలంగాణ ఆడపడుచుల చీరలు సారెలు అందచేయడంతో పాటు రూ.450 కోట్లతో ఆయా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న అన్ని పనులను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. అచ్చంపేట ఎంతో వెనుబడిన ప్రాంతమని…ఈ ప్రాంతానికి ముఖ్యంగా సాగునీరు, కృష్ణారివర్పైన బ్రిడ్జి నిర్మించాలని కోరారు. అలాగే అచ్చంపేట నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు.

పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ…అచ్చంపేటకు రావడానికి ముందుగానే జీవోలను రూ.450 కోట్లు విడుల చేయడం జరిగిందని, ఈ విషయాన్ని విమర్శించే వారు ఒకసారి సరి చూసుకోవాలన్నారు. అలాగే పండగకు ఇచ్చే చీరలు రేవంత్ రెడ్డికి తల్లి, సోదరులని… వారికి ఎలా చీరలను అందిస్తారో అదే విధంగా పంపిణీ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రేమతో కానుకగా ఇచ్చిన చీరలని…అలాగే పింఛన్లను కూడా ఇస్తున్నారన్నారు. మట్టిలో కనబడకుండా ఎక్కడో ఉన్న జాతిరత్నాలను వెలికి తీసి వారి ఆకాంక్షలను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిన గొప్ప విప్లవనాయకుడని…దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి చేస్తున్నారని.. ఇక ముందు విప్లవ నాయకుడు రేవంత్ రెడ్డి అని పిలవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి మంత్రి దామోర్ రాజనర్సింహ, మంత్రులు ఉన్న జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సమ్మక్క సారలమ్మ వారసురాలు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్; ఎంపీ మల్లు రవి, బలరామ్ నాయక్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి, దామోదర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, డాక్టర్ రాంచంద్రనాయక్, తోట లక్ష్మీకాంతరావు, డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, ఈర్లపల్లి శంకర్, బాలూనాయక్, కుందూరు జయవీర్, వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, ఆయా కార్పొరేషన్ల ఛైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కుందూరు జయవీర్, వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు చిత్తరంజన్ దాస్, ఆయా కార్పొరేషన్ల ఛైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>