Mobile Popup Ad
Mobile Popup Ad

థియేట‌ర్ల బంద్‌పై తేలేది ఆ రోజే!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప‌ర్సంటేజ్ సిస్ట‌మ్ వివాదంపై తేల్చుకునేందుకు తెలంగాణ థియేట‌ర్ల య‌జ‌మానులు (Telangana Theatre Owners) మే 23న శ‌నివారం ఒక కీల‌క స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. శ‌నివారం సాయంత్రం 3 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌కు చెందిన నిర్మాత‌ల మండ‌లి హాల్‌లో ఈ భేటీ జ‌రుగ‌నుంది. ఈ ప‌ర్సంటేజ్ విధానం విష‌యంలో గ‌త కొంత కాలంగా థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు (ఎగ్జిబిట‌ర్లు), నిర్మాత‌ల‌కు మ‌ధ్య తీవ్ర ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్‌లో త‌మ భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను, కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించేందుకు థియేట‌ర్ ఓన‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు.

ఈ శ‌నివారం జ‌రుగ‌బోయే స‌మావేశంలో ఎగ్జిబిట‌ర్లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నే అంశంపై చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం తెలంగాణ‌లో థియేట‌ర్ల బంద్‌కు పిలుపునిచ్చే దిశ‌గా అడుగులు ప‌డ‌నున్నాయా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిర్మాత‌ల వైఖ‌రికి నిర‌స‌న‌గా థియేట‌ర్ల యాజ‌మాన్యాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉండ‌టంతో, ఈ భేటీ ఫ‌లితం టాలీవుడ్ భ‌విష్య‌త్తుపై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందోన‌ని సినీ వ‌ర్గాలు ఆస‌క్తిగా గమ‌నిస్తున్నాయి.

Read Also: భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ ప్రసారాలపై సస్పెన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>