Mobile Popup Ad
Mobile Popup Ad

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి? రంగంలోకి దిగిన రజనీకాంత్

కలం, వెబ్ డెస్క్: అనిరుధ్ (Anirudh).. దేశంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైతే.. కావ్య మారన్ (Kaviya Maran) రూ.వేల కోట్ల విలువైన సన్ నెట్‌వర్క్, ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ సహా ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తూ యూత్ బిజినెస్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టే, విదేశాల్లో ఈ ఇద్దరు ట్రిప్‌కు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఎట్టకేలకు వీరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ నెలాఖరులోనే ఇందుకు సంబంధించి రెండు కుటుంబాల నుంచి ప్రకటన ఉండొచ్చని సమాచారం.

కావ్య మారన్ కుటుంబాన్ని ఒప్పించిన సూపర్ స్టార్..

దేశంలోనే టాప్ సెలెబ్రిటీ అయినప్పటికీ అనిరుధ్‌తో (Anirudh) పెళ్లికి కావ్య మారన్ కుటుంబం మొదట ఒప్పుకోలేదని టాక్. దీంతో, అనిరుధ్‌కు వరుసకు మామయ్య అయ్యే సూపర్ స్టార్ రజినీకాంత్ రంగంలోకి దిగి, పలుమార్లు మాట్లాడినట్లు కోలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. చివరికి, వీరిద్దరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మొత్తం మీద ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అనిరుధ్‌ను ఆటపట్టించిన రజినీకాంత్.. దగ్గరుండి అల్లుడి పెళ్లి జరిపిస్తున్నారని తలైవా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

Read Also: అండర్-18 ఆసియా కప్ హాకీ భారత జట్టు ప్రకటన

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>