అలర్ట్.. రేపు తెలంగాణలో గ్రామ, వార్డు సభలు

కలం, వెబ్ డెస్క్ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Telangana SIR)లో భాగంగా గురువారం (ఆగస్టు 27) తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సభలను సంబంధిత గ్రామ పంచాయతీ భవనల్లో, పట్టణాల్లో సంబంధిత పోలీంగ్ కేంద్రాల్లో నిర్వహిస్తారు.

కాగా, ఈ సభల్లో బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల పాఠశాల సభ్యులు పాల్గొని ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారు. ఈ సభలో కొత్త ఓటును, అలాగే ఓటరు వివరాలలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు తెలపవచ్చు. ప్రజలు, ముఖ్యంగా యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>