మే 1 నుంచి సింగిల్ స్క్రీన్స్ బంద్..!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు చేయాలని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. ప్రస్తుతం రెంటల్ విధానంతో నష్టపోతున్నామని, మల్టీప్లెక్సుల్లో అమలు చేస్తున్న విధంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో కూడా తమకు పర్సంటేజీ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏప్రిల్ 30 లోగా నిర్ణయం తీసుకోవాలని గడువు విధించారు. లేదంటే మే 1 నుంచి సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు (Theatres Shutdown) మూసివేస్తామని అల్టిమేటం జారీ చేశారు.

గత ఐదేండ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మల్టీప్లెక్సులతో పోటీపడలేక వెనుకబడిపోతున్నాయని, ఒకప్పుడు హౌస్​ఫుల్ బోర్డులు కనిపించిన థియేటర్లు ఇప్పుడు ఖాళీ సీట్లతో కనిపిస్తున్నాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగిల్​ స్క్రీన్ ​థియేటర్లలో సినిమా బాగా ఆడి కలెక్షన్లు వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రెంటల్, పర్సంటేజీ రూల్స్ ప్రకారం.. ఏది ఎక్కువ వస్తే అది తీసుకుంటున్నారని, సినిమా బాగా ఆడకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

కాగా, ప్రస్తుతం రెంటల్ విధానం ద్వారాం సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమాని ముందుగానే ఒక ఫిక్సుడ్​ అమౌంట్​ను డిస్ట్రిబ్యూటర్​కు చెల్లించి సినిమా ప్రదర్శన హక్కులు పొందుతున్నాడు. సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ మొత్తం డిస్ట్రిబ్యూటర్​కు వెళ్లిపోతుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్‌కు, ప్రొడ్యూసర్ కు భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, థియేటర్ యజమానికి మాత్రం రిస్క్ ఉంటోంది. అయితే మల్టీప్లెక్సుల్లో మాత్రం పర్సంటేజీ (షేర్) విధానం అమలు చేస్తుండడంతో సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒక నిర్దిష్ట శాతంలో పంచుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>