మంచిర్యాలలో దారుణం.. వృద్ధురాలి మృతదేహాన్ని పీక్కుతిన్న పిల్లులు

కలం, వెబ్ డెస్క్: మంచిర్యాల (Mancherial) జిల్లా మందమర్రి పట్టణంలో విషాదకరమైన ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా నివసిస్తున్న జక్కనబోయిన లక్ష్మి (80) అనే వృద్ధురాలు ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందారు. అయితే ఆమె మరణించిన విషయం ఎవరికీ తెలియదు. అదే సమయంలో ఆకలితో ఉన్న రెండు పెంపుడు పిల్లులు (Cats) వృద్ధురాలి మృతదేహంలోని చేతి భాగాన్ని పీక్కుతిన్నాయి. స్థానికులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వెంటనే స్పందించిన స్థానికులు ఆమె బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: తెగిన క్రేన్ వైర్.. ముగ్గురు కూలీల దుర్మరణం

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>