నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన..

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉగాది పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుడ్ న్యూస్‌ చెప్పింది. నిజామాబాద్, కామారెడ్డి  జిల్లా నగర కమిటీలను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రకటించారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు నగేష్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణల ప్రతిపాదనలకు అనుగుణంగా జాబితాలు సిద్ధం చేయబడ్డాయి.

నిజామాబాద్ జిల్లాకు 12 మంది ఉపాధ్యక్షులు, 15 మంది జనరల్ సెక్రటరీలను నియమించారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలో ముగ్గురు ఉపాధ్యక్షులు, ఏడుగురు జనరల్ సెక్రటరీలు, ఒక ట్రెజరెర్, ఇద్దరు అధికార ప్రతినిధులు, 11 మంది కార్యదర్శులను నియమించారు. కామారెడ్డిలో భారీగా 17 మంది ఉపాధ్యక్షులను నియమించడం చెప్పుకోదగ్గ విషయం. అలాగే 10 మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు. ఈ జాబితాల్లో ప్రకటించిన పదవులు ఈరోజు నుంచే అమలులోకి వస్తాయని  ప్రకటించారు.

Read Also: టాటూ వేయించుకుంటున్నారా..? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ ఫ్యాక్ట్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>