డీసీసీ కమిటీలను ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం దిశగా మరో నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీల (DCC) నియామక ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతగా రాష్ట్రంలోని 14 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీలను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud) ప్రకటించారు. ఇప్పటికే 33 జిల్లాలకు డీసీసీలను నియమించగా తాజాగా 14 డీసీసీ కమిటీలను టీపీసీసీ ప్రకటించింది.

ఉగాది పర్వదినం సందర్భంగా వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి పదవులతో పాటు పూర్తి స్థాయి కమిటీల నియామించారు. ఈ కమిటీల నియామకంపై గత పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే నియామకాల్లో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా ఉండేందుకు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud) నిన్నటి వరకు తీవ్రంగా కసరత్తు చేశారు. తాజాగా అన్ని జిల్లాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో సుదీర్ఘంగా చర్చించి ఈ జాబితాను రిలీజ్ చేశారు.

Read Also: రేపు తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్.. సీఎం రేవంత్ వ్యూహమిదే!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>