Mobile Popup Ad
Mobile Popup Ad

వెలుగుమట్ల బాధితులకు బిగ్ రిలీఫ్.. రేపే పట్టాల పంపిణీ

కలం, ఖమ్మ బ్యూరో: ఖమ్మం వెలుగుమెట్ల (Velugumatla) బాధితులకు రేపు (బుధవారం) సాయంత్రం పట్టాల పంపిణీ జరగనుంది. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో పేదలకు పట్టాలకు పంపిణీ చేయనున్నారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పేదలకు పట్టాల పంపిణీ జరగనుంది. ఇప్పటికే గుర్తించిన 311 మంది బాధితులకు అధికారులు టోకెన్లు అందించారు. వీరందరికీ ఇండ్లు కోల్పోయిన చోటనే 75 గజాల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. అందుకనుగుణంగా వెలుగుమట్లలో ఐదెకరాల స్థలాన్ని చదును చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి స్థలం ఉన్న 101మందికి ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు అందజేయనున్నారు. మొత్తంగా 412 కుటుంబాలకు రేపటితో శాశ్వత గృహ యోగం కలగనుంది.

తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకోరుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులకు బాధితులకు పట్టాలు (land pattas) పంపిణీ చేసి వెలుగుమట్ల సమస్యకు ఒక ముగింపు పలకబోతున్నారు. వెలుగుమట్ల నిరుపేదలను మోసం చేసిన దళారీ వ్యవస్థపై ముగ్గురు మంత్రులు ఉక్కుపాదం మోపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మంత్రులే పట్టాలు ఇస్తుండటం ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక మైలు రాయిగా నిలవనుంది. అయితే మొత్తం 700 ఇళ్లను కూల్చి 412 మందికే పట్టాలు ఇస్తుండటంతో పేర్లు రాని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి త్వరలో పట్టాలు అందుతాయో లేదో వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>