ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై హౌసింగ్ ఎండీ సమీక్ష

కలం, జోగులాంబ గద్వాల: ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న ప్రతి లబ్ధిదారుడికి పీఎం ఆవాస్ పథకం కింద సహకారం అందేందుకు జాబ్ కార్డులను తప్పనిసరిగా అందజేయాలని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ (VP Goutham) అన్నారు. శనివారం గద్వాల జిల్లాలో పర్యటించిన ఆయన కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎండీ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మించేందుకు లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేశామన్నారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు విచారణ జరిపి గ్రామ కమిటీ ద్వారా అర్హులైన వారికి మంజూరు చేశామన్నారు.

మార్గదర్శకాల ప్రకారం ఇళ్ల మంజూరు..

రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున నిర్మించుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఇందులో రూఫ్ రీప్లేస్మెంట్ స్కీమ్‌లో భాగంగా ఇప్పటికే రేకుల షెడ్లు, పెంకులు, తదితర ఉన్న ఇండ్ల యజమానులు ఆర్‌సీసీ వేసుకునేందుకు ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున సహకారం అందిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 500, గుడిసెల్లో ఉంటున్న వారికి 500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గుడిసెలు తొలగించుకుని పక్క గృహాన్ని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు.

పీఎం ఆవాస్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి..

పీఎం ఆవాస్ పథకం ద్వారా పక్కా గృహాల లబ్ధిదారుల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. ఇందుకు పోర్టల్‌లో ఎఫ్‌టీ‌ఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) జనరేట్ చేయాలన్నారు. ఐ‌హెచ్‌హెచ్‌ఎల్ (ఇండిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్) నిర్మాణానికి కూడా విబీ జీ రాంజీ పథకంలో రూ.12 చొప్పున సహకారం అందుతుందన్నారు. మొదటి విడతలో కప్పు స్థాయిలో ఇండ్లు నిర్మించుకొని పూర్తి చేసుకోలేకపోయిన లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించడం ద్వారా ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించవచ్చన్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాకే..

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల్లో చాలామంది ఇప్పటికే గృహప్రవేశాలు చేశారన్నారను. రెండో విడత లబ్ధిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూప్ రీప్లేస్మెంట్ పథకంలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

అనంతరం గద్వాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎండీ గౌతమ్ ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాల పురోగతి, పూర్తయిన ఇళ్ల వివరాలు,.నూతనంగా మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను సమీక్షించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఆర్డీవో ముషాహిదా బేగం, జడ్పీ సీఈవో నాగేంద్రం, డీపీవో శ్రీకాంత్, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకీ రామ్ సాగర్, తహసీల్దార్ హరికృష్ణ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>