కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Chandrababu)తో భేటీ తరువాత కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి (MLA Adinarayana Reddy) వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన వివరణలు తనకు సమంజసంగా అనిపించలేదన్నారు. మంత్రి పదవి కోసమే తాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాననే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. తాను గతంలోనే ఆ పదవిలో ఉన్నానని.. ఇప్పుడు అవసరం లేదన్నారు. ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరోసారి పేర్కొన్నారు.
అభ్యర్థుల విషయంలో బయటకు ఒకలా చెప్పి.. లోపల మరో విధంగా చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. తాము చెప్పిన అంశాలను బీజేపీ నేతలు కూడా అంగీకరించారన్నారు. తన తమ్ముడి కుమారులు జడ్పీటీసీ పదవులకు రాజీనామా చేశారని.. వాటిని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్నారు. ఆదినారాయణ రెడ్డి (Adinarayana Reddy) వ్యాఖ్యల నేపథ్యంలో కడప జడ్పీ ఛైర్మన్ తాము చెప్పినవారికి కేటాయించకపోతే.. రాజీనామా వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.
Also Read : ఎన్టీఆర్ జిల్లాలో పులి కలకలం.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

