సీతారామ ప్రాజెక్టు నుంచి నీటి విడుద‌ల‌

​కలం, ఖమ్మం బ్యూరో: కీలక దశలో ఉన్న పంటలను ఎండిపోకుండా కాపాడేందుకు సీతారామ ప్రాజెక్టు (Sita Rama Project) ద్వారా శనివారం గోదావరి జలాలను విడుదల చేశారు. రైతుల విజ్ఞప్తిపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే స్పందించడంతో సంబంధిత అధికారులు నీటి విడుదలకు చర్యలు చేపట్టారు. విడుదల చేసిన ఈ సాగునీరు ఆదివారం నాటికి మూడు మేజర్ కాలువలకు చేరుకోనుంది. ​ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నాయని, చివరి తడి అందకపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సాగునీటి అవసరాన్ని వివరించి, వెంటనే నీటిని విడుదల చేసి పంటలను రక్షించాలని కోరారు. రైతుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన మంత్రి తుమ్మల అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

​మంత్రి ఆదేశాల మేరకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అధికారులు విడుదల చేశారు. ఈ నీరు ఆదివారం నాటికి వైరా–ఏన్కూరు, అన్నపురెడ్డిపల్లి, రామచంద్రపురం మేజర్ కాలువలకు చేరనున్నాయి. దీంతో ఆయా కాలువల పరిధిలోని పంటలకు చివరి తడి అందే అవకాశం ఏర్పడింది. ​విడుదల చేసిన గోదావరి జలాలను కేవలం పంటల సాగు అవసరాలకే వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నీటిని వృథా చేయకుండా ప్రతి పొలానికి అందేలా రైతులు సమన్వయంతో సహకరించాలని కోరారు. చివరి తడి అందించి పంటలను కాపాడటం ద్వారా రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ​చివరి తడి అందక దిగుబడి దెబ్బతింటుందేమోనన్న ఆందోళనలో ఉన్న రైతులకు ఈ నీటి విడుదల పెద్ద ఊరటనిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>