కలం, మునుగోడు : నిరుపేదలకు కొండంత అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. చండూరు మున్సిపాలిటీలో అనారోగ్య కారణంగా వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను (CM Relief Fund Cheques) శనివారం నాడు స్థానిక ప్రభుత్వ అతిథి గృహం నందు మున్సిపాలిటీకి చెందిన 17 మంది లబ్ధిదారులకు గాను 6,66,000-రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు ఐతరాజు మల్లేస్తులతో కలిసి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బుషిపాక వాసు, కోడి సుష్మా వెంకన్న, కో ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, మొగుదాల వెంకన్న, చేనే సహకార సంఘం డైరెక్టర్ జూలూరు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

