కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana)లో భానుడు భగభగలాడుతున్నాడు. ఎండ తీవ్రతకు (Heatwave) జనాలు అల్లాడిపోతున్నారు. ఈ ఎండల నుంచి తట్టుకోవడానికి సామాన్యులు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వినూత్న దృశ్యం వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి మోటార్ సైకిల్‌పై వెళ్తూ ఎండ దెబ్బ తగలకుండా తలపై పచ్చటి కానుగ ఆకులను కట్టుకుని ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొదట ఈ చిత్రం కాస్త వింతగా అనిపించినా, దీని వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలు ఇలాంటి సాంప్రదాయ, వినూత్న పద్ధతులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రోజూ కూలీ పనులకు వెళ్లేవారు, డెలివరీ బాయ్స్, రైతులు, వాహనదారులు గంటల తరబడి ఎండలోనే గడపాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన వేడి కేవలం అసౌకర్యంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా మారుతోంది. రోడ్లపై సెగలు కక్కుతుండటం, వడగాల్పులు (Heatwave) వీస్తుండటంతో తలకు కాస్త చల్లదనాన్ని ఇచ్చే ఈ కానుగ ఆకులు ఆ బైకర్‌కు పెద్ద ఉపశమనంగా మారాయి. ఎండ తీవ్రత ఎంతలా పెరిగిపోతుందో, అది సామాన్యుల దైనందిన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పడానికి ఈ వైరల్ (Viral Video) దృశ్యమే ఒక ఉదాహరణ.
-ఎండ నుంచి ఉపశమనం కోసం సరికొత్త ఐడియా
-కానుగ ఆకులు తలపై కట్టుకుని బైక్ పై ప్రయాణం చేసిన వ్యక్తి
-ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్
– ఎండను తట్టుకునేందుకు ఈ ఐడియా బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్Viral video of Telangana biker highlights the harsh reality of the heatwave.… pic.twitter.com/M08qzmZbOU
— Kalam Daily (@kalamtelugu) May 23, 2026
Read Also: డెవలపర్లకు గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్‌లోకి గూగుల్ AI Studio
Follow Us On : WhatsApp

