కలం, సినిమా : టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, తనదైన మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) జీవనశైలి మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు, వరుస అవకాశాలు అందుకుంటున్నప్పటికీ ఆయన లగ్జరీ లైఫ్‌కు దూరంగా ఉంటూ సింపుల్‌గా జీవించేందుకు ఇష్టపడుతున్నారు.
లగ్జరీ కార్లలో తిరగకుండా ఇప్పటికీ తన తండ్రి ఉపయోగించిన పాత బైక్‌పైనే ప్రయాణిస్తున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోకు కూడా అదే బైక్‌పై చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. తండ్రి జ్ఞాపకంగా ఉన్న ఆ బైక్‌ను ఉపయోగించడం తనకు ఎంతో ఇష్టమని, నిరాడంబరమైన జీవితాన్నే కోరుకుంటానని ఆయన తెలిపారు. స్టార్‌డమ్ పెరుగుతున్నా జీవనశైలిలో మాత్రం మార్పు లేకుండా సింపుల్‌గా ఉంటున్న భీమ్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

