తల్లి, బిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యం.. పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు

​కలం, ఖమ్మం బ్యూరో: తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పినపాక ఎమ్మెల్యే (Pinapaka MLA), ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం రైతు వేదికలో నిర్వహించిన “మన అంగన్వాడీ.. మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సామూహిక శ్రీమంతాల వేడుకలో ఆయన పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో మహిళలు పౌష్టికాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను పరిశీలించి స్థానిక ఆహార పదార్థాల ప్రాధాన్యతను వివరించారు. అలాగే చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సంక్షేమ సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>