కలం, వెబ్‌డెస్క్: మొబైల్ గేమ్స్‌లో క్యాండీ క్రష్ అంటే తెలియని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు టైంపాస్ కోసం ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక లెవెల్ 1 నుంచి వేలల్లో లెవెల్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ యువకుడు క్యాండీ క్రష్ గేమ్‌లో ఇంటర్నేషనల్ రికార్డు (Candy Crush Record) క్రియేట్ చేశాడు. అతడు మన ఇండియాకు చెందిన వాడే కావడం విశేషం. బీహార్‌కు చెందిన శుభమ్ కుమార్ (19) (Shubham Kumar) క్యాండీ క్రష్‌లో అత్యధిక లెవెల్స్ కంప్లీట్ చేసిన వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటి వరకు శుభమ్ 22,222 లెవెల్స్ పూర్తి చేశాడు.
దీంతో శుభమ్ కుమార్ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. శుభమ్ ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఖాళీ సమయంలో ఈ గేమ్ ఆడుతూ ఉంటాడు. తరచూ వేలాది లెవెల్స్ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఒక లెవెల్ దాటిన కొద్దీ మరో లెవెల్ వస్తూనే ఉంది. శుభమ్ ఈ రికార్డు క్రియేట్ చేసిన తర్వాత కూడా గేమ్ కొనసాగిస్తూ 23,000 లెవెల్ కూడా దాటేశాడు. కేవలం గేమింగ్‌లోనే కాకుండా విద్యారంగంలోనూ రాణిస్తున్న అతడి ప్రతిభను గుర్తించి బీహార్ ప్రభుత్వంలోని సైన్స్, టెక్నాలజీ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అభినందించింది.

