బీజేపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్యే నాయిని

కలం, వరంగల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అనుసరిస్తున్న విధానాలు, వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్‌తో పోల్చడం అత్యంత దుర్మార్గమని, ఈ వ్యాఖ్యలపై తక్షణమే బీజేపీ మంత్రులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు వారే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వివక్ష చూపుతోందని అన్నారు. దేశంలో అభివృద్ధి పేరుతో బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కుల మతాల పేరుతో రాజకీయాలు చేస్తుందని, ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయడం లేదని ఆరోపించారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి వంటి నాయకులు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు గట్టిగా మాట్లాడాలని, ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఈ బిల్లుకు తమ మద్దతు ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగకుండా కొన్ని సవరణలు చేయాలని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ వంటి రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నుల్లో ఒక రూపాయి వెళితే కేవలం 25 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని, మిగతా నిధులు ప్రధానంగా ఉత్తరాది, బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం మానేసి సమానత్వంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>