తెలంగాణలో భూముల రీసర్వే.. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో భూముల రీసర్వే (Land Resurvey)కు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రీసర్వేకు 4 రోజుల ముందే భూమి యజమానులకు నోటీసులు ఇచ్చి, రెండు రోజుల ముందే పట్టాదారులకు ఫ్లాగ్స్ అందజేయనుంది. సర్వే పూర్తయ్యాక భూమి కొలతల వివరాలు రైతులకు ఇవ్వనుంది. యజమానులు చేసిన ఫిర్యాదులపై తనిఖీల తర్వాత అభ్యంతరాలు పరిష్కరించి తుది గెజిట్ జారీ చేయనుంది. ఆ తర్వాతే భూభారతి రికార్డులను సవరించనుంది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం-1923, తెలంగాణ భూ భారతి చట్టం-2025 నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తుది గెజిట్ అనంతరం భూ భారతి చట్టం ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ (RoR), భూ భారతి పోర్టల్‌లో అవసరమైన సవరణలను ఎమ్మార్వోలు పూర్తి చేయాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>