గద్దర్ అవార్డుల ప్రకటన.. అవార్డులు దక్కించుకున్నది వీళ్లే..!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ ప్ర‌భుత్వం 2025 సంవ‌త్స‌రానికి గానూ గ‌ద్ద‌ర్ సినీ అవార్డుల‌ను (Gaddar Film Awards) ప్ర‌క‌టించింది. జ్యూరీ స‌భ్యులు దిల్‌రాజు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, మ‌ణిశ‌ర్మ‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప్ర‌గ‌తి, రోజార‌మ‌ణి వివ‌రాలు వెల్ల‌డించారు. ఉత్త‌మ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి అవార్డు ద‌క్కించుకుంది. తండేల్ సినిమాలో న‌ట‌న‌కు నాగ‌చైత‌న్య ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యారు. ఇక గ‌ర్ల్ ఫ్రెండ్ మూవీలో యాక్టింగ్‌కు ర‌ష్మిక మంద‌న్నాను ఉత్త‌మ న‌టి అవార్డు వ‌రించింది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ఆక‌ట్టుకున్న సాయిలు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యారు. ఈ అవార్డుల‌ను మార్చి 19న ఉగాది రోజు విజేత‌ల‌కు అంద‌జేస్తారు.

అవార్డులు (Gaddar Film Awards) ద‌క్కించుకున్న‌ది వీళ్లే..

ఉత్త‌మ స‌హాయ న‌టుడు – శివాజీ (దండోర)
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – చిరంజీవి
పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్
సినారె అవార్డు – సుద్దాల అశోక్ తేజ
అక్కినేని నాగేశ్వరరావు అవార్డు – జయసుధ
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనీదత్
రఘుపతి వెంకయ్య అవార్డు – రమేశ్ ప్రసాద్
కాంతారావు అవార్డు – ఆర్.నారాయణమూర్తి

 Read Also: మరోసారి ఆస్కార్ అవార్డుల వేడుకకు ప్రియాంకా చోప్రా!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>