Mobile Popup Ad
Mobile Popup Ad

మేళ్లచెర్వు శివాలయానికి రూ.కోటి మంజూరు చేసిన ప్రభుత్వం

కలం, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు (Mellacheruvu) మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీస్వయంభూ శంభులింగేశ్వర స్వామి (Swayambu Shivalayam) ఆలయానికి తెలంగాణ సర్కారు రూ.కోటి మంజూరు చేసింది. ఈ ఏడాది మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు వసతులు కల్పించడం కోసం నిధులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను స్పెషల్ డవలప్‌మెంట్ కింద కేటాయించారు. నిధులను సక్రమంగా వినియోగించాలని, పనుల పురోగతి ఆధారంగా నిధులు విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే మహాశివరాత్రి ఉత్సవాలకు ముందే నిధులు మంజూరు కావడంతో ఆలయ కమిటీతో పాటు భక్తుల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.

Read Also: మీరు పైసలిస్తే మేం సర్వే చేస్తాం.. సమ్మక్క బ్యారేజీపై చత్తీస్‌గఢ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>