తెలంగాణ‌లో ఐఏఎస్‌ల బ‌దిలీలు..!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Govt) ప‌రిపాల‌నా అవ‌స‌రాల దృష్ట్యా ప‌లువురు ఐఏఎస్, నాన్ క్యాడ‌ర్ అధికారుల‌ను బ‌దిలీ (IAS Transfers) చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. స‌హ‌కార శాఖ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్‌, స‌హ‌కార సంఘాల రిజిస్ట్రార్‌గా ఉన్న రాహుల్ రాజ్‌కు మార్కెటింగ్ శాఖ డైరెక్ట‌ర్ ప‌ద‌వికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పోస్టును అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న ఆర్.లక్ష్మణుడు (నాన్‌ క్యాడర్)ను ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పించింది. రాహుల్ రాజ్ మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తన ప్రస్తుత బాధ్యతలను కూడా కొనసాగిస్తారు.

అదేవిధంగా జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న రాజా గౌడ్ (ఎస్‌జీడీసీ)ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read : ‘రాబరీ మినిస్టర్‌గా’ పొంగులేటి.. ఏలేటి సంచలన ఆరోపణలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>