కలెక్టరేట్ ముట్టడికి ఏబీవీపీ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రూ. 12 వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కరీంనగర్ శాఖ (ABVP Karimnagar) ఆద్వర్యంలో మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అంతకు ముందు ఏబీవీపీ కార్యకర్తలు, విధ్యార్థులతో కలిసి తెలంగాణ చౌక్ నుంచి భారీగా ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

స్కాలర్ షిప్ ప్రభుత్వ బిక్ష కాదు.. విధ్యార్థుల హక్కు అంటూ మండిపడ్డారు. వెంటనే పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బారీకేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు విధ్యార్థి నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఏబీవీపీ విద్యార్థి నాయకులు, విధ్యార్థులను ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శ్రవణ్ బిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన ఫీజులను ఇవ్వకుండా విద్యార్థుల చదువులను మానేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కుట్ర చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాలన కొన సాగిస్తుందే తప్ప ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని.. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తూ కేసులు పెడుతూ జీవితాలను అంధకారంలో నెట్టుతున్నాయని దుయపడ్డారు.

ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి మానుకొని విద్యార్థులకు రావాల్సిన 12 వేల కోట్ల స్కాలర్షిప్లను బకాయిలను విడుదల చేయాలని.. త్వరితగతిన ఉద్యోగులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల జార్ఖండ్ లో విద్యార్థులు చేసిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అంతా ఏకం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసేంతవరకు ఏబీవీపీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు మల్యాల రాకేష్, అజయ్, జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ బామాండ్ల నందు, కార్యకర్తలు అజయ్, శివ, విగ్నేష్, ఆకాష్, యశ్వంత్, నిత్య, బన్నీ, రాజేందర్, సూర్య, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>