చెరువులోకి దూసుకెళ్లి మునిగిపోయిన కారు!

క‌లం, వెబ్ డెస్క్‌: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ కారు చెరువులోకి దూసుకెళ్లి మునిగిపోయింది. షాద్ నగర్ (Shadnagar) సమీపంలోని చటాన్పల్లిలో ఈ ఘటన జ‌రిగింది. స్థానికులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని కారును బ‌య‌ట‌కు తీశారు. కారులో ఎవరూ లేకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారు చెరువులో పడ్డాక వెళ్లిపోయారా? లేక ఎవరైనా చెరువులో పడి మునిగిపోయారా? అనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాత్రి సమయంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేసిన‌ సాహసంపై స్థానికులు అభినందించారు.

Read Also: గ్రామస్తులపై తేనెటీగల దాడి!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>