కలం, వరంగల్ బ్యూరో : గ్రేటర్ వరంగల్ (Greater Warangal) సమగ్ర భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 5,257 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ (GO) జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులలో 25 శాతం గ్రాంట్‌గా మంజూరు చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులను భరించనుంది. మిగిలిన 50 శాతం రుణాలను బ్యాంకులు ద్వారా సేకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది.
Read Also: కామారెడ్డిలో కలకలం.. ఐదుగురు చిన్నారులు మిస్సింగ్
Follow Us On: Facebook

