కలం, వెబ్ డెస్క్: కామారెడ్డి (Kamareddy) పట్టణంలో ఐదుగురు చిన్నారులు అదృశ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గోసంగి కాలనీకి చెందిన అన్నదమ్ములు సింహాద్రి (10), విజయ్ (9)లతో పాటు ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపల్ (8), ఆయాత్ (7), మరియం (5)లు వేర్వేరుగా ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఒకే రోజు రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన చిన్నారులు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి స్వయంగా ఘటనా స్థలాలను పరిశీలించి విచారణ జరుపుతున్నారు. అదృశ్యమైన చిన్నారుల (Children) కదలికలను గుర్తించేందుకు పోలీసులు స్థానిక సీసీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు.
Read Also: రాష్ట్రపతిని బెంగాల్ ప్రభుత్వం అవమానించింది : ప్రధాని మోడీ
Follow Us On: X(Twitter)

