Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్ నౌక విషయంలో మాది సరైన నిర్ణయమే : భారత్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ కు చెందిన యుద్ధ నౌక (Iran Warship) ఐరిస్-దేనాను శ్రీలంక తీరం దగ్గర్లో అమెరికా ముంచేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్ వద్ద మరో ఇరాన్ నౌక సేఫ్ గా ఉందని ఇప్పటికే భారత్ ప్రకటించింది. ఈ విషయాలపై తాజాగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) స్పందించారు. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ ఆర్), మిలాన్ 2026లో పాల్గొనేందుకు కొన్ని ఇరాన్ యుద్ధ నౌకలు ఇక్కడకు వచ్చినట్టు జైశంకర్ స్పష్టం చేశారు.

‘భారత్ కు వచ్చిన రెండు ఇరాన్ యుద్ధ నౌకలు తిరిగి వెళ్తున్న క్రమంలో ఐరిస్-లావన్ అనే యుద్ధ నౌకలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దీంతో ఆ నౌకను కొచ్చిలో అత్యవసరంగా నిలిపేందుకు ఇరాన్ రిక్వెస్ట్ చేసింది. దానికి అనేక రూల్స్ అడ్డుగా ఉన్నప్పటికీ.. భారత్ మానవతా దృక్పథంతో అంగీకరించింది. ఆ నౌకలో ఉన్న 183 మంది సిబ్బందికి ప్రస్తుతం కొచ్చిలో ఆశ్రయం కల్పిస్తున్నాం. మరో నౌక ఐరిస్-దేనా భారత్ నుంచి ఇరాన్ వెళ్తుండగా శ్రీలంక తీరంలో అమెరికా సబ్ మెరైన్ దాడి చేసింది. ఆ విషయంపై ముందుగా శ్రీలంక నేవీకి ప్రమాద హెచ్చరిక వచ్చింది. దీంతో శ్రీలంక నేవీ సహాయక చర్యలు చేపట్టింది. ఆ తర్వాత ఇండియన్ నేవీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. కానీ అప్పటికే 150 మంది గల్లంతయ్యారు. మిగిలిన వారికి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఇరాన్ యుద్ధ నౌకల విషయంలో భారత్ ది సరైన నిర్ణయమే’ అంటూ జైశంకర్ (Jaishankar) చెప్పుకొచ్చారు.

Read Also: విడాకులపై స్పందించిన టీవీకే చీఫ్ విజయ్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>