Mobile Popup Ad
Mobile Popup Ad

ఇదీ ఇల్లందు సత్తా.. నిన్న సివిల్స్ , నేడు గద్దర్ అవార్డ్

కలం, ఖమ్మం బ్యూరో: నిన్న సివిల్స్ ర్యాంకు, నేడు గద్దర్ అవార్డ్ లభించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (Yellandu) మండలం వార్తల్లో నిలిచింది. శుక్రవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో బానోతు లక్ష్మీ రచన 178వ ర్యాంక్ సాధించగా, శనివారం గద్దర్ అవార్డుల్లో సాయిలు కంపాటి (Director Saailu) ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. సాయిలు 2025లో తీసిన రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమచిత్రంగా ఎంపికైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు రెండు అవార్డులు రావడం గమనార్హం. ఇల్లందు మండలంలోని కొమరారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ సినిమాల మీద ఇష్టం పెంచుకున్నాడు.

తన లక్ష్యం కోసం హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరకు 2015లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం లభించడంతో కాస్త నిలదొక్కుకున్నాడు. వెంకటేశ్ నారప్ప చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం దక్కించుకున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి చిత్రం కథ యదార్థ ఘటన ఆధారంగా రూపొందించబడింది. అయితే సివిల్స్ ర్యాంకర్, ఉత్తమ దర్శకుడు (Best Director Gaddar Award) ఇద్దరూ ఇల్లందు (Yellandu) మండలానికి చెందినవారే. ఇద్దరూ ఒక్క రోజు తేడాతో ఇల్లందుకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: గ్రేటర్ వరంగల్ భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 5,257 కోట్లు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>