Mobile Popup Ad
Mobile Popup Ad

మొక్కజొన్న రైతులకు శుభవార్త.. పంట కొనుగోళ్లు షురూ

కలం, వెబ్ డెస్క్: మొక్కజొన్న రైతులకు (Maize Farmers) తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పారు. ఈ పంట కొనుగోళ్ల కోసం అదనంగా మరో రూ.1800 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వివరాలు వెల్లడించారు. మొక్క జొన్న కొనుగోళ్ల కోసమని ఇప్పటికే ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయించింది. పరిమితికి మించి రావడంతో కొన్ని రోజులుగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలో పలు జిల్లాల నుంచి వచ్చిన వినతుల మేరకు నిన్న కేబినెట్ (Cabinet) సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మక్క రైతులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. అదనపు కొనుగోళ్లకు వెంటనే నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ఊపందుకోనుంది.

జొన్న కొనుగోళ్ల కోసం రూ.1,100 కోట్లు

అదే సమయంలో, జొన్న కొనుగోళ్లకు వెంటనే రూ.1,100 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Tummala) తెలిపారు. ప్రతి రైతు దగ్గర నుంచి పంట కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. అయితే, పలు జిల్లాల్లో రైస్ మిల్లుల సామర్థ్యం నిండిపోవడంతో కాంటాలు మెల్లగా సాగుతున్నాయి.

Read Also: మహిళా సాధికారత వారోత్సవాలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం

Follow Us On: X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>