ఇరాన్ సంచలన వ్యుహం.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కట్..?

కలం, వెబ్ డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ (Iran) మధ్య జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుతుంది. అటు అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇటు ఇరాన్ క్షిపణులు, బాంబులతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. అయితే ఈ పోరు కేవలం క్షిపణులు, బాంబులకే పరిమితం కాకుండా.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసే డిజిటల్ యుద్ధం వైపు మళ్లుతోందనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిని దిగ్భందించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత వేధిస్తోంది. భారత్ వంటి దేశాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతే దీనికి నిదర్శనం. ఇక ఇప్పుడు అంతర్జాతీయ ఇంటర్నెట్ (Internet) వ్యవస్థను కూడా ప్రమాదంలోకి నెట్టేందుకు ఇరాన్ సంచలన వ్యుహం చేస్తోందని అంతర్జాతీయ వార్త సంస్థల నుంచి కథనాలు వెలువడుతున్నాయి.ఈ వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా మనం వాడుతున్న ఇంటర్నెట్ డేటాలో ఎక్కువ శాతం సముద్ర గర్భంలో మైళ్ల పొడవునా ఏర్పాటు చేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రవహిస్తుంది. ఇరాన్ కు చేరువలో ఉన్న హార్ముజ్ జలసంధి (Stairs of Hormuz), ఎర్ర సముద్రం లోని బాబ్ ఎల్-మందేబ్ ప్రాంతాల్లో దాదాపు 20కి పైగా అతిముఖ్యమైన సబ్‌సీ కేబుల్స్ ఉన్నాయి. ఈ సన్నని తీగలు వేల కిలోమీటర్ల మేర విస్తరించి వీడియో కాల్స్, ఇ-మెయిల్స్ నుండి బ్యాంకింగ్ బదిలీలు, ఏఐ సేవల వరకు, ప్రపంచ ఇంటర్నెట్‌కు శక్తినిచ్చే దాదాపు మొత్తం డేటాను మోసుకెళ్తాయి. ఈ నేపథ్​యంలో ఇప్పటికే హార్ముజ్ జలసంధికి అడ్డంగా సముద్ర మైన్ లను అమర్చిన ఇరాన్.. ఎర్ర సముద్రంలో తన అనుకూల హౌతీ రెబల్స్ ను నిలుపుతుంది.

ఇప్పటికే ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ ఆ ప్రాంతాన్ని డేంజర్ జోన్‌గా మార్చేశారు . ఇక ఆ ప్రాంతంలో అడుగున ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్‌ (Undersea Cables) లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ దాడులు చేసే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.గతంలో హౌతీల దాడుల వల్ల కొన్ని కేబుల్స్ దెబ్బతిని ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్ వేగం దారుణంగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హోర్ముజ్, బాబ్ ఎల్-మందేబ్ వంటి కీలక మార్గాలు మూతపడటంతో.. ఒకవేళ కేబుల్స్ తెగితే వాటిని రిపేర్ చేయడం దాదాపు అసాధ్యమేననే టాక్ వినిపిస్తోంది.

హార్ముజ్ జలసంధికి అడ్డంగా సముద్ర మైన్‌లను ఇరాన్ (Iran) అమర్చడంతో అక్కడికి షిప్పింగ్ లైన్లు చేరుకోవడం అసాధ్యం. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లోకి కేబుల్ రిపేర్ షిప్స్ వెళ్లడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు, యజమానులు అంగీకరించరు. దీనివల్ల ఇంటర్నెట్ నెమ్మదించడం మాత్రమే కాక.. వారాల తరబడి డిజిటల్ వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటుందో లేదో తెలియకపోయినా, ఆ అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. ఈ నష్టం కేవలం ఫోన్లు మరియు వెబ్‌సైట్‌లకే పరిమితం కాదని, బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రులు, ఏఐ వ్యవస్థలు అన్నీ ఈ లింకులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇరాన్ అలా చేస్తే గల్ఫ్ దేశాలతో మొదలు పెట్టి భారత్ వరకూ చాలా దేశాలు నష్టపోతాయి. ఒకవేళ ఇరాన్ కావాలని ఈ కేబుల్స్‌ను టార్గెట్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి.ఇదే జరిగితే క్రూడ్ వార్ కాస్తా.. ‘డేటా యుద్ధం’గా మారి ప్రపంచం చీకట్లోకి వెళ్లడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: టాటూ వేయించుకుంటున్నారా..? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ ఫ్యాక్ట్స్

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>