నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరింది: జగన్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) ఆరోపించారు. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో దాడి చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. నారసూర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందని ఆరోపించారు. దాడి చేసిన అధికార పార్టీ నేతలకు రక్షణ కల్పిస్తూ.. బాధితులు, ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ హార్డ్ డిస్క్‌లు పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకున్నారని జగన్ ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యాల ఆధారాలు దాచేందుకేనా ఈ డ్రామాలు అని నిలదీశారు. ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న ఆయన.. సీదిరి అప్పలరాజుపై రాజకీయ కక్షతో కేసు పెట్టారని ఆరోపించారు. అయితే అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని జగన్ అన్నారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో వైసీపీనీ భయపెట్టలేరని ధ్వజమెత్తారు. ఆరాచక పాలనపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

జెన్ జీ ప్రశ్నలకు సమాధానం లేకే అణచివేత..!

రాష్ట్రంలోని జెన్ జీ తరం డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తోందని జగన్ అన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి హామీలపై నిలదీస్తున్న యువత ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు, పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతుందని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>