సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు ప్రత్యేకాధికారి!

కలం, వెబ్ డెస్క్: ఎల్ నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్రతరమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి పది జిల్లాలను ప్రాతిపదికన చేసుకుని.. సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించింది. వీరంతా 20వ తేదీన కేటాయించిన జిల్లాలకు వెళ్లి.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిర్వహించే సమీక్షలో పాల్గొనాలని సూచించింది.

ఉదయం నుంచి శాఖలపై సమీక్షలు..

ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యవసాయ, నీటిపారుదల, హార్టికల్చర్, భూ గర్భ జల, ప్లానింగ్, పంచాయతీరాజ్, విద్యుత్తు, మున్సిపల్ శాఖలపై సమీక్షలు చేయబోతున్నారు. ఎల్ నినో ప్రభావంపై ఎలా వ్యవహరించాలో.. జిల్లా స్థాయిలో ఎలాంటి ప్రణాళికలు రచించి అమలు చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయబోతున్నారు.

పది జిల్లాలకు అధికారులు వీరే..

  1. హైదరాబాద్ – జయేశ్ రంజన్

2. రంగారెడ్డి – వికాస్ రాజ్

3. కరీంనగర్ – బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా

4. మెదక్ – వాణీ ప్రసాద్

5. నిజామాబాద్ – డాక్టర్ యోగితా రాణా

6. నల్లగొండ – దాసరి హరిచందన

7. ఆదిలాబాద్ – ఇలంబర్తి

8. వరంగల్ – శ్రీ దేవసేన

9. మహబూబ్ నగర్ – వీపీ గౌతమ్

10. ఖమ్మం – అనుదీప్ దురిశెట్టి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>