కలం, యాదగిరిగుట్ట: వన మహోత్సవం–2026లో (Vana Mahotsavam 2026) భాగంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ఇంటింటికీ హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4వ వార్డు కౌన్సిలర్ కట్టబత్తిని స్వప్న ఆంజనేయులు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలకు పండ్ల, ఔషధ, నీడనిచ్చే మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రజలను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ కట్టబత్తిని ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీని పచ్చదనంతో నిండిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మొక్కలను పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

