కలం, వెబ్ డెస్క్ : ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో విద్యార్థులకు ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ను దృష్టిలో ఉంచుకుని కేరళ, మణిపూర్ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు రేపు (సోమవారం) సెలవు (School Holiday) ప్రకటిస్తూ ఆయా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను విద్యార్థులు వీక్షించేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మ్యాచ్ భారత్ కాలమాన ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. దీంతో తెల్లారి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతారనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా ఫుట్‌బాల్‌కు విశేష ఆదరణ ఉన్న కేరళ, మణిపూర్ రాష్ట్రాల్లో ఫుట్ బాల్ టోర్నమెంట్ పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు, ఫుట్‌బాల్ అభిమానులు ప్రపంచ కప్ మ్యాచ్‌లను ఆస్వాదించేలా ఈ సెలవు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

