బాబర్ కు షాక్.. కెప్టెన్సీకి రాజీనామా చేయాలని డిమాండ్!

కలం, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ లో కెప్టెన్సీ రచ్చ మళ్ళీ మొదటికి వచ్చింది. జట్టు మార్పుల వేళ బాబర్ అజామ్ (Babar Azam) వెంటనే తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయాలని మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanvir Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. గతంలో షాన్ మసూద్ కెప్టెన్సీలో పాక్ 16 టెస్టుల్లో 12 ఓటములు ఎదుర్కొంది.

దీంతో షాన్ మసూద్ ను తొలగించి, జులై 5న బాబర్ అజామ్ ను మళ్లీ కెప్టెన్ గా నియమించారు. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో బాబర్ గాయపడ్డాడు. దాంతో మొదటి టెస్టుకు సల్మాన్ ఆఘా తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం పీసీబీ జట్టులో పలు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో పిటివి స్పోర్ట్స్ లో మాట్లాడిన తన్వీర్ అహ్మద్ బాబర్ పై మండిపడ్డారు. బాబర్ కెప్టెన్సీకి రాజీనామా చేయకపోతే తాను తీవ్రంగా నిరాశ చెందుతానని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆట ఆడలేనని, కెప్టెన్ గా ఉండలేనని బాబర్ స్పష్టం చేయాలని సూచించారు.సహచర ఆటగాళ్లను జట్టు నుంచి తొలగిస్తున్నప్పుడు బాబర్ మాత్రం పదవిలో కొనసాగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పదవి కోసం మాత్రమే బాబర్ ఇలా చేస్తున్నాడనే భావన ప్రజల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. సరైన నిర్ణయాలు తీసుకునే నాయకుడికే గౌరవం దక్కుతుందని తన్వీర్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>