కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లా మెట్‌పల్లి (Metpally) పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి వరంగల్ కు బయలుదేరిన వరంగల్–2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు, తెల్లవారుజామున మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాన్న ఢీకొట్టింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా.. వీరిలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

