భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాల్సిందే!

​కలం, ఖమ్మం బ్యూరో: సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) డిమాండ్ చేసింది. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ ఎదుట ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ​ఈ ధర్నాలో ఏఐకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఎకరా చొప్పున తగిన పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు మద్దతు ధర కల్పించి, ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలన్నారు. అర్హులైన పోడు రైతులకు హక్కు పత్రాలు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి పగటిపూటే నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

​ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.15 వేల చొప్పున ఎలాంటి కోతలు లేకుండా అందించాలన్నారు. గతంలో ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ​ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, సలిగంటి శ్రీనివాస్, వి. పూర్ణచందర్ రావు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>