రేపు కాంగ్రెస్ నిరసనలు.. ఇదే ప్రధాన డిమాండ్!

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా రేపు తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టబోతుంది. మంత్రులతో సహా అందరూ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసనల్లో పాల్గొనాలని గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో కూడా సర్ ప్రక్రియ గందరగోళంగా సాగుతోందని.. చిన్న చిన్న తప్పులు సాకుగా చూపి ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని పీసీసీ నేతలు ఆరోపిస్తున్నారు.

ట్యాంక్ బండ్ వద్ద ధర్నా..

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కీలక నేతలు రేపు ఉదయం 10.30 గంటలకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ భవన్ వద్ద ధర్నా చేపట్టబోతున్నారు. దీనికి మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలో జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ.. సర్ ప్రక్రియను బలవంతంగా దేశ ఓటర్లపై రుద్దుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. దీని అమలులో అనేక లోపాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా రేపు చేపట్టబోయే ధర్నాకు తరలిరావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>