కొండాపూర్‌లో డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

కలం, నిర్మల్ రూరల్: నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ (Kondapur) గ్రామంలోని శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రంలో ప్రపంచ చెవిటి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. నిర్మల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.

శిబిరంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు, మానసిక వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, స్పీచ్ పాథాలజిస్టులు తదితర వైద్యులు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి. రవీందర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేందర్, వైద్యులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>