జర్నలిస్టులకు అండగా ఎమ్మెల్యే యెన్నం: రూ. 2 లక్షల చెక్కు అందజేత!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తెలిపారు. పాలమూరు జర్నలిస్టు సంక్షేమ సంఘానికి తన వంతు సహకారంగా ప్రతి నెలా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించిన ఆయన, రెండు నెలలకు సంబంధించిన రూ.2 లక్షల చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంఘం ప్రతినిధులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పాత్రికేయులు పనిచేస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం ఎంతో ముఖ్యమని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆర్థిక సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారికి పాలమూరు జర్నలిస్టు సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అశోక్ కుమార్, మధుసూదన్ రెడ్డి, తిరుపతయ్య, అయిలమోని శేఖర్, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>