పేదలకు గుడ్‌న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఇండ్లులేని పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) దరఖాస్తు స్వీకణ గడువు పొడిగించింది. ఆగస్టు 10 వరకు చివరి తేదీ ఉండగా.. తాజాగా ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

క్యూర్ (CURE) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకంలో భాగంగా మొత్తం 7,340 ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటికి ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు రాగా దరఖాస్తులు గడువు పెంచినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

అప్లికేషన్లకు ఆగస్టు 10 వరకు గడవు విధించగా.. వరుస సెలవులు రావడంతో మరో ఐదు రోజుల దరఖాస్తు స్వీకరణను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>