మూసీ రివర్ ఫ్రంట్‌కు లైన్ క్లియర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న మూసీ రివర్ ఫ్రంట్ (Musi Riverfront) డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగంగా మొదటి దశ పనులకు లైన్ క్లియర్ అయింది. అన్ని రకాల అనుమతులు జారీ చేస్తూ కేబినెట్ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. దీనిలో భాగంగా, తొలి దశలో 21 కిలోమీట‌ర్ల పొడవునా రూ.7,345.12 కోట్ల విలువైన అభివృద్ధి ప‌నులకు ఆమోదం తెలిపింది. హిమాయ‌త్ సాగ‌ర్ నుంచి ఈసా ఉప నది, ఉస్మాన్ సాగ‌ర్ నుంచి మూసా ఉప నది ప్ర‌వాహాలు ప్రారంభ‌మ‌య్యే చోటు నుంచి బాపూఘాట్ వరకు ఈ ప‌నులు చేపట్టబోతున్నారు.

డిప్యూటేష‌న్‌కు అంగీకారం..

మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌నులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్.. ఇందు కోసం నూత‌నంగా 147 పోస్టులను క్రియేట్ చేసింది. వీటితో పాటు అవసరం మేరకు ఇత‌ర శాఖ‌ల నుంచి అధికారులు, సిబ్బందిని డిప్యూటేష‌న్‌కు మీద తెచ్చుకునేందుకు సైతం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలోనే మూసీ అభివృద్ధి పనులు చకచకా జరిగే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>